Posts

మరికొన్ని సుమతీ శతక పద్యాలు ...

మరికొన్ని సుమతీ శతక పద్యాలు .... ఉత్తమ గుణములు నీచున కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలం దా నెత్తిచ్చి కఱగిపోసిన నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ ! వివరణ : ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లుకానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు . --------------------------------------------------------- అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ! వివరణ : అడిగినప్పుడు జీతమియ్యని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది. -------------------------------------------------------- కనకపు సింహాసమున శునకముఁ గూర్చుండఁ బెట్టి శుభలగ్నమునం దొనరఁగఁ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! --------------------------------------------------- స్త్రీల యెడల వాదులాడక బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నింద సేయకెన్నడు సుమతీ! వివరణ : స్త్రీలతో ఎన్నడూ గొడవ పడద్దు, చిన్న పి

స్వార్ధపరుడు

Image
చందమామ కొనగానే మొదట చదివేది విక్రమార్కుడి బేతాళ కథే.ఇది కూడ వారు ప్రచురించిన కథే... నేను కేవలం సేకరించి ఇక్కడ ఉంచాను . పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ఎన్నో ఇక్కట్లకోర్చిన తర్వాత, నీ ప్రయత్నం ఫలించినా, నువ్వెవరికోసమైతే ఇన్ని కఠోర శ్రమలకోర్చావో, ఆ వ్వక్తి కేవలం స్వార్థపరుడూ, భోగలాలసుడూ అని తెలుసుకుని నువ్వు నిరాశకు గురయ్యే అవకాశం వుంది. ఇందుకు ఉదాహారణగా, సుఖభోగాలకు అలవాటుపడి స్వార్థపరుడుగా మారిపోయిన స్పందనదాసు అనే ఒక కవి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు: దుర్గాపురం అనే గ్రామంలో స్పందనదాసు అనే ఒక యువకుడుండేవాడు. అతడు చెట్టూ పుట్టా, రాయీ రప్పా, మనిషీ-మృగం-ఒకటేమిటి, దేనిమీదనైనాసరే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటంత వీనులవిందుగా గొప్ప కవిత్వం చెప్పేవాడు. దుర్గాపురంలో పేదా గొప్పా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కడూ స్పందనదాసు కవిత్వాన్ని ఆనందంతో తన్మయులౌతూ వినేవారు. తృణమో పణమో క

మౌన యోగి

Image
చందమామ కొనగానే మొదట చదివేది విక్రమార్కుడి బేతాళ కథే.ఇది కూడ వారు ప్రచురించిన కథే...నేను కేవలం సేకరించి ఇక్కడ ఉంచాను పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి,, చెట్టుపైనుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఈ అర్ధరాత్రి వేళ, భయంగొలిపే ఈ శ్మశానంలో ఏ కార్యార్ధివై ఇన్ని ఇక్కట్లకు ఓర్చి శ్రమిస్తున్నావో తెలియదు. కానీ, నువ్వు మహాత్ముడు, మహా యోగి అని ఎవరినైనా నమ్మి వాళ్ళ కోసం ఇన్ని బాధలకు లోనవుతుంటే మాత్రం తగు హెచ్చరికలో వుండడం అవసరం. ఎందుకంటే, అలాంటివాళ్ళల్లో చాలామంది రాజాశ్రయంలో సుఖభోగాలు అనుభవించ వచ్చునన్న తాపత్రయంలో ఉంటారు. ఇందుకు ఉదాహారణగా, మౌనయోగి రాజు కనకసేనుడు అనే వాళ్ళ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు: మమతాపురి అనే నగరం శివార్లలోని కరుణానది తీరంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుండేది. ఆ చెట్టు కింద ఒక యోగి ఉండేవాడు. అతణ్ణి చూసిన జనం మొదట అతడొక పిచ్చివాడు అనుకున్నారు. కానీ, అతడిలో ఎలాంటి మతిభ్రమణ లక్షణాలూ కనిపించలేదు. అతడి వళ్ళ ఎవరికీ ఎన్నడూ ఎటువంటి కష్టమూ కలగలేదు. అందువల్ల అతడ

సుమతీ శతకం

చిన్నప్పుడు పద్యాలు బాగా చెప్పేదాన్ని,బళ్ళో చేరక ముందునుంచే,అమ్మ పద్యాలు నేర్పించడం నాకు బాగా గుర్తు ...ఇప్పుడు ఆ రోజులు తల్చుకుంటే మన తర్వాత తరం వాళ్ళు చాలా మిస్సవ్వబోతున్నారనిపిస్తుంది, కొన్ని పద్యాలు గుర్తు చేసుకుందామా,...పద్యాలు మాత్రమేకాదు అప్పటి జ్ఞాపకాలు కూడా తప్పకుండా గుర్తొస్తాయి. **************************************** ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్ నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ ! **************************************** పుత్రోత్సాహము తండ్రికి బుత్రుఁడు జన్మించినపుడే పుట్టదు జను లా పుత్రునిఁ గనుఁగొని పొగడఁగఁ బుత్రోత్సాహంబు నాడు పొందు ర సుమతీ ! **************************************** సరసము విరసము కొఱకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొఱకే పెరుఁగుట విరుఁగుట కొఱకే ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ ! **************************************** ఎప్పుడు సంపద కలిగిన నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్ దెప్పలుగ జెఱువు నిండినఁ గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ ! *************************************** ఎప్పుడుఁ దప్పులు వెదకెడు నప్పురుషునిఁ గ

బుడుగు-చిచ్చుల పిడుగు

Image
నేను బాపు-రమణ గారి అభిమానిని.వారి బుడుగు కి వీరాభిమానిని...వారు రాసిన బుడుగు-చిచ్చుల పిడుగు ఎన్నిసార్లు చదివానో తెలీదు. బాపుగారి బొమ్మలు,రమణగారి మాటలు.....ఇప్పటికీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు హాచ్చెరం,బోల్డు లాంటి పదాలు వాడేస్తుంటాను. మన బుడుగు చేసిన అల్లర్లలో మచ్చుకి ఇక్కడ కొన్ని........ అమ్మ నన్ను ఎప్పుడేన కొడితే ,నాన్న అప్పుడు అమ్మకి ప్రెవేటు చెప్తాడు.నేను దెబ్బలాట అనుకున్నాను కానీ ,ప్రెవేటు అని బాబాయి చెప్పాడు.ఊసారేమో నాన్నేమో ,అమ్మ చెవి పట్టుకుని కీ ఇస్తున్నాడు,అంతట్లోకి నాకు ఆకలేసింది,అమ్మా ప్రెవేటు అయిందా,ఆకలేస్తోంది అన్నం పెట్టుదు గాని అన్నాను.అమ్మకి కోపం వచ్చింది కాబోలు,కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు.అందుకని ఛీ పోకిరీ వెధవకానా అంది కోపంగానూ,నవ్వుతూనూ.. నాకు తరవాత బాబాయి చెప్పాడు.ప్రయివేటు చెప్తుంటే అన్నం పెట్టమనకూడదు అని.ఇగో ఈ పెద్దవాళ్ళేం,ఎప్పుడూ ఏమిటీ సరిగ్గా చెప్పరు.దీన్నే లోపం అంటారుట.ఇలా అని మనం అంటే మళ్ళీ కోపం.

బుడుగు-చిచ్చుల పిడుగు-2

Image
అప్ప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రయివేటు మేష్టారుట.ఎవడికి తెలుసు ముందస్తుగా వాళ్ళేనా చెప్పాలి , లేకపోతే అమ్మా నాన్నా యేనా చెప్పాలి . ఇలాగే అయితే పిల్లలు వూరుకోరు,నేను మంచి వాణ్ణి కాబట్టి (అప్పుడు అందరూ నన్ను పెంకి వెధవాయి అన్నా పోన్లే కదా అని,ఆ మేష్టారు చేత మూడ్రోలు దాకా ప్రయివేటు చెప్పించాను,అదె ఇంకొడైతేన ఒకరోజు కూడా ఆ ఛాన్సు ఇవ్వడు.నా దగ్గర పది మంది మాష్టార్లు పని చేసారనుకో,వాళ్ళందరూ నిఝెంగా మంచివాళ్ళే.కాని పాపం రెండ్రోలో పదకొండ్రోలో అయ్యాక వాళ్ళే మానేసేవాళ్ళునన్ను భరించలేను అని చెప్పారుట నాన్నతో.(భరించటం అంతే మొయ్యటం అని బాబాయి చెప్పాదు)ఉత్త అబధ్ధం.నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుదూ అనలేదు కూడా.అయినా వాళ్ళలా అనడం అన్యాయం కాదూ? అని అడుగుతున్నాను. అయితే అన్యాయం అని తెలీదు వాళ్ళకి.అపార్ధం తెచ్చుకున్నారన్నమాట.అంటే కోపం తెచ్చుకొవడంట.ఇలా అయితే పిల్లలు ఎంత అపార్ధం తెచ్చుకోవాలి.ఒక మాట చెప్తా విను.నేనున్నాననుకో.నాకు ప్రయివేటు చెప్పిన ఒక్కొక్క మేష్టారూ ఒక్కొక్కలాంటి వాడు.ఒక మేష్టారెమొ నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో ఇలా ఎడమ వేపుకి తిప్పుతాడు కదా.పోన్లే అని ఊరుకుంటామ ఇంకో కొన్నాళ్ళకి కొ

బుడుగు-చిచ్చుల పిడుగు

Image
నేను బాపు-రమణ గారి అభిమానిని. వారి బుడుగు కి వీరాభిమానిని...వారు రాసిన బుడుగు-చిచ్చుల పిడుగు ఎన్నిసార్లు చదివానో తెలీదు. బాపుగారి బొమ్మలు,రమణగారి మాటలు.....ఇప్పటికీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు హాచ్చెరం,బోల్డు లాంటి పదాలు వాడేస్తుంటాను. మన బుడుగు చేసిన అల్లర్లలో మచ్చుకి ఇక్కడ కొన్ని........ బుడుగు-చిచ్చుల పిడుగు నా పేరు బుడుగు అంటే పిడుగు.మా బామ్మ హారి పిడుగా అంటుంది,అందుకు.ఇంకో అస్సలు పేరు ఉంది.ఇప్పుడు చెప్పడానికి టైము లేదు.అది చాలా పొడుగు.కావలిస్తే మా నాన్నని అడుగు. అగో మా నాన్న.మా నాన్నకి నేను కొడుకు.ఇలా అని కొత్త ప్రైవేటు మాష్టారు చెప్పాడు వీడు మంచివాడు కాదు అంటే చెడ్డవాడు.అసలు వీడే కాదు ఈ ప్రైవేటు మాష్టార్లందరూ అంతే. చిన్న పిల్లలకి చదువు చెప్పడం రాదుపైగా సొంటి పిక్కలు తీస్తానంటారు.ఈడుకు తగని లెక్కలు చెయ్యమంటారు. ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మబాబోయ్ అనేసింది.(బామ్మకి అ,ఆ లు కూడ బాగా రావుట.). అంతేనేం మళ్ళా మాష్టారొస్తే రండి బాబూ అని చాపేస్తుంది.